Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి
నవతెలంగాణ-పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అంతా తాను చేసిందేనని సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ హోంమంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు.శుక్రవారం మండలంలోని పూలయాతండా వరద కాలువ సమీపంలో ఉన్న మఠంలో ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు.మిగులు నిధులున్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు.దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు. లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భతి,ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి తన కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలిచ్చారని ఎద్దేవా చేశారు.ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ.30 వేల కోట్ల అప్పుల పాలు చేశారని మండిపడ్డారు.ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని,ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు.కేసీఆర్ డబుల్ బెడ్రూంలు ఇస్తామన్నారని, కానీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని గుర్తు చేశారు.మూడెకరాల భూమి ఇస్తామన్నారు..కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు వేలాది ఎకరాల పొడుభూములు ఇచ్చిందనని గుర్తు చేశారు.సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వబట్టే మీరంతా మీరంతా ఎమ్మెల్యేలు,మంత్రులు అయ్యారని గుర్తు చేశారు.నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ లేదా అని ప్రశ్నిచారు.ఇంటింటికి భగీరథ నీళ్లు ఇస్తామ న్నారు.నియోజక వర్గంలోఎన్ని ఇండ్లకు నీరిచ్చారో చెప్పాలని కోరారు.సాగర్ ఎడమ కాలువపై మా హాయాంలో 1500లకు పైగా లిఫ్టులు ఏర్పాటు చేశామన్నారు. రూ.రెండు లక్షలు ఒకేసారి రుణమాఫీ చేశామన్నారు.కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ నాలుగుసార్లు చేసి రైతులను మోసం చేశారన్నారు.సాగర్ నియోజకవర్గానికి ఏడేండ్లకాలంగా టీఆర్ఎస్ చేసింది శూన్యమన్నారు.ప్రతి గ్రామానికి బీటీరోడ్లు, సీసీరోడ్లు వేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కింద న్నారు.ఓటమి భయంతోనే నెలరోజుల ముందే ఇన్చార్జీలను, ఎమ్మెల్యేలను నియమించి ప్రచారం నిర్వహిస్తు న్నారని ఎద్దేవా చేశారు.కేంద్రంలో నరేంద్రమోదీ...ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని, ప్రజలు,ఆలోచించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడిన కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని జానారెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపిపి రమావత్ శంకర్ నాయక్,ఎంపీటీసీ గోదాల నారాయణరెడ్డి, తెప్పలమడుగు మాజీ సర్పంచ్ చామల సువర్ణ,యూత్ అధ్యక్షుడు రాజు,సంతోష్, చల్లా హన్మంతరెడ్డి పాల్గొన్నారు.