Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జానారెడ్డి ప్రజలకు చేసిందేమీ లేకనే మొహం చాటేస్తున్నారు
- మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ-హాలియా
మోడీ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.ఎన్నికల ఇన్చార్జి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు సమక్షంలో వివిధ గ్రామాలకు చెందిన 500 మంది బీజేపీ కార్యకర్తలు కడారి అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో హాలియాలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్లో చేరారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బీజేపీ, మోడీ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి కేంద్రం ప్రజలను దోచుకుంటుందన ఆరోపించారు.కాంగ్రెస్ ఉనికి లేనే లేదని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైందన్నారు.జానారెడ్డి కూడా ఔట్ డేట్ అయ్యాడని, జానారెడ్డి ప్రజలకు చేసింది ఏం లేకనే మొహం చాటేస్తున్నాడన్నారు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ ఖేల్ ఖతం అవుతున్నదన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ సాగర్ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. జానారెడ్డి కూడా అడ్రస్ లేకుండా పోతాడన్నారు. నోముల భగత్ విజయాన్నిఎవ్వరు అడ్డుకోలేరన్నారు. జానారెడ్డి హుందాగా పోటీ నుంచి తప్పుకుంటే గౌరవం దక్కేదని, కానీ ఇప్పుడు జానారెడ్డికి ఉన్నపరువు పోతుందన్నారు.టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ఇంచార్జి తక్కెలపల్లి రవీందర్రావు మాట్లాడుతూ కేసీఆర్ పట్టుబడితే ఏదైనా సాధిస్తారన్నారు.సాగర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ విజయం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ నోముల వారసుడు భగత్ పేరును ప్రకటించగానే ప్రతిపక్షాలు డీలా పడ్డాయన్నారు. అభివద్ధి జరగాలంటే టీఆర్ఎస్ గెలవాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మాట్లాడుతూ తనపై చూపెడుతున్న అభిమానానికి సాగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానన్నారు. నాన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతానన్నారు.ఈ సమావేశంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, శానంపూడి సైదిరెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, టీఆర్ఎస్ నాయకులు బాబురావు నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.