Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 సార్లు పోటీ..7 సార్లు విజయం..
- 11వ సారి తలపడుతున్న జానా
- జానాకు సవాల్‌గా మారిన ఉప ఎన్నికలు
కుందూరు జానారెడ్డి రాజకీయాల్లో తలపండిన నేత. కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అందరికీ తెలిసిన నేత. అలాంటి నేత ఎన్నికల్లో ఎపుడు పోటీ చేసినా.. తనను ప్రజలే ఆదరిస్తారనే నమ్మకంతో ప్రచారం నిర్వహించుకునే వారు. గెెలుపు, ఓటమిలు కూడా ఆయన చరిష్మా ద్వారానే సాధ్యమయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి మారింది... ఈ ఎన్నికలు ఆ పెద్దాయనను ఒకింత కలవరానికి గురిచేస్తున్నాయి. అందుకే గతంలో ఎన్నడు లేనంతగా నియోజకవర్గంలో కాలుకు బలపం కట్టుకుని తిరుగుతూ ..చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ పలకరిస్తూ ఓటేయమని అభ్యర్థిస్తున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,19,745 ఓట్లు ఉన్నాయి. అందులో 1,08,907 ఓట్లు పురుషులవి కాగా 1,01,907 మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజక వర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి.
1972లో ఏర్పడ్డ చలకుర్తి నియోజకవర్గం
1967లో చలకుర్తి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి 2004 వరకు అదే పేరుతో కొనసాగింది. నియోజక వర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో నాగార్జునసాగర్ పేరుతో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. చలకుర్తి నియోజకవర్గంలో మూడు సార్లు నిమ్మల రాములు (కాంగ్రెస్), ఐదుసార్లు కుందూరు జానారెడ్డి విజయం సాధిం చారు. అందులో రెండు సార్లు టీడీపీ, మూడు సార్లు కాంగ్రెస్ గుర్తుపై గెలిచారు. ఒకసారి రాంమూర్తి యాదవ్ (టీడీపీ) విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ తర్వాత రెండు సార్లు జానారెడ్డి (కాంగ్రెస్),
ఒకసారి నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) గెలుపొందారు.
14 శాఖలు ఒకేసారి...
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ఎక్కువ కాలం మంత్రి పదవి చేపట్టిన నాయకుడిగా జానారెడ్డికి పేరుంది. అంతేగాకుండా ఎన్టీఆర్ కాలంలో 14శాఖలకు ఒకేసారి మంత్రిగా పనిచేసిన చరిత్ర ఆయనది. దేశంలో ఎక్కడ కూడ ఒకేసారి ఇన్ని శాఖలకు బాధ్యతలు చేపిట్టిన నాయకుడు మరొకరు లేరు.య ఆయన మంత్రిగా పని చేసిన కాలంలోనే తాలుకాలకు స్వస్థి పలికి మండల వ్యవస్థకు పునాది పడింది. 1999లో తాను చేసిన అభివృద్ధి చూసి ప్రజలు గెలిపిస్తారని నమ్మకంతో నామినేషన్ వేసిన తర్వాత ఒక్క రోజు కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. కానీ అపుడు టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.
ప్రతిసాకీ ఆయన చరిష్మానే కీలకం ..
జిల్లా రాజకీయాలలోనే కాదు... ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే జానారెడ్డికి ఓ ప్రత్యేకస్థానం ఉంది. జానా పోటిచేసిన మొదటి రెండుసార్లు మాత్రమే ఎన్టీఆర్ ప్రభంజనంతో విజయం సాధించారు. మిగతా 8 సార్లు పోటీ చేసి ఎన్నికల ప్రచారానికి జాతీయ నేత ఎవరూ ఎన్నికల ప్రచారానికి రాలేదు. అయినా ఐదుసార్లు గొప్ప మెజార్టీతో విజయం సాధించారు. ఒక్కసారి మాత్రం ప్రచారానికి దూరంగా ఉండడం వల్లే ఓడిపోయారని స్థానిక ఓటర్లు భావించారు. అయితే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఆయన 11వ సారి ఎన్నికల బరిలోకి అనివార్యంగా దిగాల్సి వచ్చింది. ఏ గ్రామానికి వెళ్లినా పుష్కలమైన అనుచరగణం ఉండేది...అడుగడునా నీరాజనాలు పలికేవాళ్లు..గతంలో ఉన్న చరిష్మా ఈసారి ఉందా.. అది ఆయనకు కలిసొస్తుందా..లేదా అనే అనుమానం అందరిలో ఉంది.
సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ
1967 నిమ్మల రాములు ఇండిపెండెంట్
1972 నిమ్మల రాములు కాంగ్రెస్ 1978 నిమ్మల రాములు కాంగ్రెస్
1983 కుందూరు జానారెడ్డి టిడిపి
1985 కుందూరు జానారెడ్డి టిడిపి
1989 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ 1994 రాంమూర్తి యాదవ్ టిడిపి
1999 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్
2004 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ 2009 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్
నాగార్జున సాగర్
2014 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ 2018 నోముల నర్సింహయ్య టీఆర్ఎస్