Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రభుత్వం గ్రామాల్లో పనిచేస్తున్న ఐకేపీ వీఓఏలకు ఇస్తున్న వేతనాన్ని రూ.3 వేల నుండి రూ.15 వేలకు పెంచుతూ ప్రకటన చేయాలని తెలంగాణ ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంచికంటి కోటేశ్వరరావు కోరారు.శనివారం జిల్లాకేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవ నంలో ఐకేపీ వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు కన్నం శారద అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఐకేపీకేంద్రాల నిర్వహణకు సంబంధించిన కమీషన్లు నేటికీ అందించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ మాట్లాడుతూ వీఓఏలకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షురాలు కన్నం శారద మాట్లాడుతూ గత సీజన్ నుండి ఐకేపీ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వీవో ఏలకు ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు ప్రకటించి నేరుగా వీఓఏల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పండగ శైలజ, నాయకులు నర్సింగ్ నాయక్, హుస్సేన్, శ్రీనివాస్, అంజయ్య, స్వరూప, నాగేంద్రమ్మ పాల్గొన్నారు.