Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ నజీయర్స్వామి, మంత్రి ఎర్రబెల్లి, మైహోమ్స్ అధినేత
నవతెలంగాణ-మేళ్లచెర్వు
మండలంలోని శ్రీనగర్ కాలనీలోని మైహ్మౌ ఇండిస్టీస్‌లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగవైభవంగా నిర్వహించారు.ఈఉత్సవానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మైహోం ఇండిస్టీస్ చైర్మెన్ జూపల్లి రామేశ్వర్రావు శ్రీకుమారి, జీఎం మునగాల రామ్మోహన్రావు అరుణ, జూపల్లి వినోద్‌రావు భార్గవి, జూపల్లి రంజిత్‌రావు రంజిత, జూపల్లి రామురావు మేఘన, జూపల్లి శ్యామ్‌రావు ఐశ్వర్య దంపతులు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఎర్రబెల్లి మురళీధర్‌రావు హాజరయ్యారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో వేదమూర్తులు వేద మంత్రోచ్ఛరణాలు, మేళతాళాల మధ్య వెంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు.చిన్నజీయర్‌స్వామి భక్తులకు తీర్థం పంపిణీ చేశారు.అనంతరం మహా సిమెంట్స్ సౌజన్యంతో, భక్తి నివేదన ఆధ్యాత్మిక పత్రిక సమర్పణలో...ప్లవనామ సంవత్సర క్యాలెండర్, పంచాంగాన్ని త్రిదండి చిన్న జీయర్ స్వామి, మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర్రావుతో కలిసి ఆవిష్కరించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణవేడుకను తిలకించారు.
తెలంగాణలోని ప్రతి గ్రామం దేశానికి ఆదర్శం కావాలి
అధికారులతో సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణలోని ప్రతి గ్రామం దేశానికి ఆదర్శం కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మైహోమ్ సిమెంట్స్‌లో కల్యాణ మహోత్సవం తర్వాత జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులతో అయా శాఖల అభివద్ధి పనులపై ఆయన సమీక్షించారు.గ్రామాల్లో కరోనా ఉధతి ఎలా ఉంది ? నివారణ, ప్రజా చైతన్య కార్యక్రమాల్ని అడిగి తెలుసుకున్నారు.సామాజికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక, సామూహిక కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని సూచించారు.నర్సరీలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకతి వనాలు, శ్మశానవాటికల పనులు పూర్తి చేసి వాటిని వాడుకలోకి తేవాలని సూచించారు.ఎండల తీవ్రత కారణంగా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచినీరు అందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రతి అవార్డు మన తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రతి గ్రామం దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు.అవార్డులు పొందిన గ్రామాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.