Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌ను గెలిపించి ఆత్మగౌరవం చాటుకోవాలి
- మాజీ మంత్రి షబ్బీర్ అలీ
నవతెలంగాణ-హాలియా
సాగర్ ఉపఎన్నికల్లో జానా గెలుపు చారిత్రక అవసరమని, కాంగ్రెస్‌ని గెలిపించి ఆత్మగౌరవం చాటు కోవాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు.శనివారం హాలియాలోని జానా నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుదీర్ఘకాలం రాజ కీయాల్లోనున్న జానారెడ్డి రాష్ట్రాభివద్ధితో పాటు, నియోజకవర్గ అభివద్ధి పాటుపడ్డారన్నారు.జానా చేసిన అభివద్ధిని ఓర్వలేకనే టీఆర్ఎస్ నాయకులు అవాక్కులు.. చవాక్కులు పేలుతున్నారన్నారు.జానాకు ప్రజల్లో విశేష ఆదరణ ఉందన్నారు.దమ్ముంటే ప్రచారం చేయకుండా ప్రజాస్వామ్యంలో గెలవాలన్నారు.అభివద్ధి చేయకనే టీఆర్ఎస్ నాయకులు ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు.జానాపై లేని పోని ఆరోపణలు మానుకోవాలని, ఇలాగే కొనసాగిస్తే సహించేది లేదని, ఉపఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.కేంద్రంలోనున్న బీజేపీ, రాష్ట్రంలోనున్న టీఆర్ఎస్ను దొందూ దొందే నన్నారు.బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి ప్రజావ్యతిరేక బిల్లును టీఆర్ఎస్ ఆమోదపరుస్తూ మద్దతు తెలుపుతూ బయటకు చూడగా నాటకాలాడుతుందని దుయ్యబట్టారు.గత ఎన్నికల్లో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఇంధన ధనం పెరుగుతుంటే కేసీఆర్ కేంద్రంపై పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదన్నారు.డబ్బుల అహం కారంతో టీఆర్ఎస్ నేతలు సాగర్‌లో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని, వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్‌నాయక్, నాయకులు కుందూరు వెంకట్‌రెడ్డి, చంద్రారెడ్డి, మజహర్ మహ్మద్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ చింతల చంద్రారెడ్డి, గౌని రాజారమేశ్‌యాదవ్, కుకుడాల ఆంజనేయులు, అస్లాం పాల్గొన్నారు.