Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-నిడమనూరు
ఈ నెల17న జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని తుమ్మడం గ్రామంలో మాజీ ఎంపీపీ రంగశాయిరెడ్డి నివాసంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.2023 ఎన్నికల్లో రాష్టంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్టాన్ని అప్పుల కుప్పగా తయారు చేసిందని ఆరోపించారు.నిరుద్యోగంతో యువకులు ఉద్యోగాలు లేక చదివిన చదువుకు న్యాయం చేయలేక ఉరితాళ్లకు వేలాడుతున్నా కేసీఆర్‌కు మాత్రం నిద్ర మబ్బు వదలడం లేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివద్ధి తప్ప రాష్టం లో ప్రధానంగా ఒరిగిందేమీ లేదన్నారు.నాగార్జున సాగర్ మరింత అభివద్ధి చెందాలంటే జానారెడ్డి గెలుపుతోనే అది సాధ్యమౌతుందన్నారు.కార్యకర్తలు అధైర్య పడకుండా గెలుపుకోసం కషి చేయాలని పిలుపునిచ్చారు.డబ్బు సంచులతో రాజకీయం చేయడం టీఆర్ఎస్ సంస్కృతికి నిదర్శనమన్నారు.జానారెడ్డి దగ్గర చేతులు కట్టుకున్న కొంతమంది ఈరోజు ఆయన ఓటమి కోసం పనిచేస్తూ కాలం గడుపుతున్నారని, ప్రజలు వారిని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, రాష్ట్ర నాయకులు షబ్బీర్ అలీ, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, యడవెల్లి రంగశాయిరెడ్డి పాల్గొన్నారు.