Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ - వలిగొండ
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలెదుర్కుంటున్న సమస్యలు, గత ఎన్నికల్లో పాలకులు ఇచ్చిన హామీల అమలును తెలుసుకుని వాటి పరిష్కారం కోసమే జన చైతన్య పాదయాత్ర నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి. జహంగీర్ తెలిపారు. శనివారం వలిగొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాదయాత్ర జిల్లాలో 900 కిలో మీటర్లు సాగుతుందన్నారు. ఇప్పటి వరకూ 78 గ్రామాల్లో 12 రోజులు 299 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక, ఒక అంచనా అంటూ ఏమీ లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యలే నేటి తెలంగాణలోనూ ఉన్నాయన్నారు. జిల్లాలో 66 కిలో మీటర్లు ఉన్న మూసీ గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. బస్వాపురం, చిన్న నీటి వనరులను ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నర్సింహా, కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బట్టుపల్లి అనురాధ, రమేష్, నాయకులు వేముల మహేందర్, మదిన రాజయ్య, స్వామి, సురేందర్, యువ తెలంగాణ నాయకులు చిలువూరి సత్తిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోడ సుదర్శన్, మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య, బీసీ సంఘం మండలాధ్యక్షులు సాయిని యాదగిరి, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.