Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల వేధింపులే కారణమంటున్న బాధితుని బంధువులు
నవతెలంగాణ-సంస్ధాన్నారాయణపురం
భూ వివాదం విషయంలో ఓ రైతు అధికారుల ముందు పురుగుల మందు తాగిన సంఘటన మండలంలోని చిమిర్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామంలోని సర్వే నెంబర్ 110, 116,117లో సుర్విరాజుకు చెందిన వ్యవసాయ భూమి నుంచి రోడ్డు ఇవ్వాలంటూ ఆదే గ్రామానికి చెందిన దండుగుల నగేష్, సుర్కంటి నర్సిరెడ్డి, రవీందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విషయంనై ఏడాది కాలంగా వివాదం నడుస్తోంది. గత నెల 25న బాట వివాదాన్ని పరిష్కరించేందుకు సర్వే చేయనున్నట్టు రెవెన్యూ అధికారులు సుర్విరాజుకు నోటీసులు ఇచ్చారు. ఆ రోజు సర్వే చెయకపోను 30న చేస్తామంటు మరో సమాచారం ఇచారు. 30న కూడా చేయలేదు. తిరిగి శనివారం ఉదయం 9 గంటలకు సర్వే కోసం వస్తామని తెలిపారు. కానీ అధికారులు సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చారు. ఈ క్రమంలో పెద్ద మనుషులందరూ వెళ్లిపోయారు. సుర్వి రాజుకు చెందిన 110 సర్వే నెంబర్లో 10గుంటల భూమి బాట నిమిత్తమై రిజిస్ట్రేషన్ అయినట్టు దండుగుల నగేష్, సూర్కంటి నర్సిరెడ్డి, సుర్కంటి రవిధర్రెడ్డిలు చెప్పడంతో చౌటుప్పల్ డీఐ సర్వే చేసి రాజు పట్టా భూమిలో నుంచి ఎలాంటి బాటా లేదని నిర్ధారించారు. అయిన అధికారులు వినకుండా సుర్వి రాజును నానా మాటలు అన్నారు. దీంతో మనస్థాపం చెందిన రాజు చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్‌కుమార్, నారాయణపురం తహశీల్దార్ వి.బ్రహ్మయ్య, ఏఎస్ఐ శ్యాంసుధర్రెడ్డిల సమక్షంలో పురుగుల మందు తాగాడు. తన పట్టా భూమిలో నుంచి ఎలాంటి బాట లేకపోయినా తహశీల్దార్ బ్రహ్మయ్య కావాలని తనను ఇబ్బందికి గురి చేస్తున్నట్టు రాజు వాపోయాడు.