Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ - వలిగొండ
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి విమర్శించారు. సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో తలపెట్టిన జన చైతన్య పాదయాత్ర శనివారం మండలంలోని జాలుకాలువ, గొల్లపల్లి, నాగారం, వలిగొండలో సాగింది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందానికి స్థానిక ప్రజలు, కళాకారులు, కార్మికులు, సీపీఐ(ఎం) శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో నంద్యాల మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రజాసమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఏండేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రాల మీద పెత్తనం చెలియిస్తున్న మోడీ ప్రభుత్వం నిధులివ్వకుండా తాత్సారం చేస్తుందన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులను మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీ, గుజరాతీలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసమే రైతు, కార్మిక చట్టాలు తీసుకొచ్చిందన్నారు. పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పేదలకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.