Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర సర్పంచ్ కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి మృతి టీఆర్ఎస్కు తీరని లోటని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.ఉద్యమ కాలం నుండి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదన్నారు. ఆదివారం మండలకేంద్రంలో ఆయన అంత్యక్రియలకు మంత్రి హాజరై మాట్లాడారు.విజరుభాస్కర్‌రెడ్డి మతి చెందిన వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.అంత్యక్రియలకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్ పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్,జిల్లా ప్రజాపరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరికిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు,మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్,నాయకులు ఎంసీ.కోటిరెడ్డి హాజరయ్యారు.అంతకుముందు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దివంగత విజయభాస్కర్‌రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వయస్సులో చిన్న వాడైనప్పటికి రాజకీయంగా పరిణితి చెందిన విజయభాస్కర్‌రెడ్డికి సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నమోదు చేసుకున్న విజయాలలో భాగస్వామ్యం ఉందని కొనియాడారు.అటువంటి నేత నల్లగొండ జిల్లా టీఆర్ఎస్లో ఒక రోల్ మోడల్‌గా నిలిచిపోతాడని అభివర్ణించారు.