Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-నాగార్జునసాగర్
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ డబ్బు, మద్యం పంచుతూ గెలిచే సంస్కృతి సంప్రదాయాన్ని తీసుకొచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.ఆదివారం మున్సిపాలిటీపరిధిలోని హిల్ కాలనీ కమ్మ సంఘం లో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ డ్యాం నీడలో ఉండి కాంగ్రెస్ ఏం చేసిందని టీిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడేండ్ల కాలంలో పర్యాటకం ప్రతిష్టను దిగజార్చిందన్నారు.సాగర్‌లో అంతర్జాతీయ టూరిజం కేంద్రాన్ని అభివద్ధి చేస్తానని, నందికొండ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను ఎంపీ కోటా నుండి నిధులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కష్టపడి జానారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జానారెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్‌లో తెలంగాణ ప్రాంతంలో వెనకబడిన తరగతుల గురుకుల పాఠశాలను మొట ్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హయాంలోనేనని గుర్తుచేశారు.నాగార్జునసాగర్ ప్రభుత్వ క్వాటర్స్‌లో నివాసం ఉండే రెండు వేల కుటుంబాలకు కాంగ్రెస్ హయాంలో నామినల్ ధరలకే క్వాటర్స్‌ను కేటాయిం చామన్నారు.డ్రయినేజీ వ్యవస్థను,ఇంటర్నల్ రోడ్లను రూ.10 కోట్లు కేటాయించి అభివద్ధి చేశానని, గ్రామ గ్రామాన విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్‌దేనని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ,ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మోహన్‌రావు, నాగార్జునసాగర్ టౌన్ అధ్యక్షులు రామకష్ణారెడ్డి, ఓర్సు కష్ణ, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి ,రాంబాబు, రంగారెడ్డి, బాలాజీ, మైనార్టీ నాయకులు హాబీబ్, డి.కొండ వేణు,సాగర్‌బాబు, జంగయ్య, చిన్ని, కోటేశ్వరరావు, శంకర్, జనార్దన్, వాసు పాల్గొన్నారు.