Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గరిడేపల్లి:ఈనెల 9న ఖమ్మంలో జరిగే వైఎస్.షర్మిలమ్మ సంకల్పసభను జయప్రదం చేయాలని షర్మిలమ్మ అనుచరుడు ఆదెర్ల శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం మండలకేంద్రంలో వైఎస్ఆర్ అభిమానులతో సంకల్ప సభ పోస్టరావిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నిధులు, నీళ్లు, నియామకాలు అంటూ గద్దెనెక్కిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అరకొర పనులతో కాలాన్ని వెళ్ళబుచ్చుతూ తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందన్నారు.దీనికి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశయ సాధనకు, రాజన్న రాజ్య స్థాపన లక్ష్యంగా ఈనెల 9న ఖమ్మంలో జరగబోయే సంకల్ప సభ ద్వారా వైఎస్ షర్మిలమ్మ ఏర్పాటు చేయబోయే పార్టీ గురించి మనందరికీ తెలియజేసేందుకు వస్తున్నందున ఈ ప్రాంత వైఎస్ఆర్ అభిమానులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆరిగెల రవి, అంకారావ్, బొలిషెట్టి మధు, శ్రీను, గణేష్, రాంబాబు, ప్రసాద్, శివాజీ, పిట్ట నాగరాజు, సతీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మోతె : ఈనెల 9న ఖమ్మంలో నిర్వహించు వైయస్ షర్మిల సంకల్ప సభను విజయవంతం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి అధ్యక్షులు మిడుతనపల్లి విజరు విద్యార్థులకు పిలుపునిచ్చారు ఆ సంఘం ఆధ్వర్యంలో వైఎస్ షర్మిలను హైదరాబాద్ లోటస్పాండ్లో కలిసి పూలబొకేను ఇచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిట్టల రాంరెడ్డి,సుధీర్, జానయ్య, మహేష్, రమేశ్, శ్రీను పాల్గొన్నారు.