Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్రెడ్డ్డి గొల్లకుర్మలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి మధ్దెపురం రాజు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణకేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఈనెల 2 వ తేదీన రాజాపేట మండల కేంద్రం రైతు వేదిక ప్రారంభోత్సవ సభలో రెండో విడత గొర్రెలు రాలేదని ప్రశ్నించిన గొర్రెల కాపరి ఐలయ్యను పోలీసుల చేత సభాస్థలి నుండి బయటకు గెంటివేయించారన్నారు. స్థానిక వెటర్నరీ సిబ్బందిని అతనికి రెండో విడత గొర్రెల ఇవ్వకూడదని ఆదేశించి అవమాన పరిచినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ్మ,సహాయ కార్యదర్శులు ఎల్లముల సత్యనారాయణ,జోగు శ్రీనివాస్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు మొరిగాడి రమేష్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి ఫౌల్, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు జూకంటి సంపత్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చెన్న రాజేష్,నాయకులు బాల్దె కష్ణ, గాదె చంద్రయ్య పాల్గొన్నారు.