Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, నలుగురికి గాయాలైన సంటన ఆదివారం నకిరేకల్ బైపాస్ రోడ్డుపై చోటు చేసుకుంది. నకిరేకల్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ ఫిలిం నగర్ నుండి శ్రీ వాసవి మూవీస్ చిత్రీకరణ బృందం తణుకుకు సినిమా చిత్రీకరణ నిమిత్తం కారులో వెళ్తున్నారు. నకిరేకల్ బైపాస్ వద్ద కారు టైర్ ఫంక్షర్ కావడంతో అదుపు తప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సినిమా సౌండ్ ఇంజనీర్ గార్లపాటి రవి (53) అక్కడికక్కడే మతి చెందాడు. సినిమా ఎడిటర్ జి అనిల్ కుమార్, కారు డ్రైవర్ ఈ. సురేంద్ర, వికారాబాద్ కు చెందిన శ్రీకాంత్, హైదరాబాద్ పార్వతి నగర్ కు చెందిన ఏ. శ్రీనివాస్ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం వారిని హైదరాబాద్కు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.