Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1 నుంచి 30 వరకు ఫూలే, అంబేద్కర్ సందేశ్ యాత్రలు, జాతరలను నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో 12న జరిగే నీలి దండు కావాత్లో యువతీ ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున కోరారు. ఆదివారం స్థానిక దొడ్డికొమురయ్య భవనంలో నిర్వహించిన ఆ సంఘం పట్టణ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 నుండి 18వ తేదీ వరకు పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్ర ఉంటుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం , రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదలను కొల్ల గొడుతోందన్నారు. దేశవ్యాప్తంగా దళితులు , గిరిజనులు , మహిళలు , మైనార్టీలు బలహీన వర్గాలపై మనువాదుల దాడులు పెరిగాయని అన్నారు. రాజ్యాంగాన్ని తొలగించి దాని స్థానంలో మనువాదాన్ని అమలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. మనువాదుల కుట్రలకు అడ్డుకట్టవేసి రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ - ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. మహనీయులు జయంతులు ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, 11న మహాత్మ జ్యోతి బాపూలే , 5న జగ్జీవన్రాం జయంతులను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీమ్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పేరిక కష్ణ, ఉపాధ్యక్షులుగా నిరుడు రమాకాంత్, ఉగ్గు అన్నపూర్ణ, ప్రధాన కార్యదర్శిగా గాదె నరసింహ, సహాయ కార్యదర్శులు నేతకాని మురళీధర్ ,బోడ శివ, కోశాధికారిగా బొజ్జ సైదులు, ప్రచార కార్యదర్శిగా అవుట నాగేశ్వరరావు ,మరో 21 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తయ్య,ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణ కుమారి ,పోలే సత్యనారాయణ, పాండు, లింగయ్య,లక్ష్మి ప్రసన్న,శ్రీను, తదితరులు పాల్గొన్నారు.