Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -మోటకొండూరు
బునాదిగాని కాల్వ పనులను వెంటనే పూర్తి చేసి బస్వాపురం ప్రాజెక్టు ద్వారా మండల రైతులకు సాగునీరు అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జాహంగిర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం, యాదాద్రి జిల్లా సమగ్రాభివద్ధి కోసం 30 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పల్లె పల్లె తిరుగుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర ఆదివారం మండల పరిధిలోని కదిరేని గూడెంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జహంగీర్ మాట్లాడుతూ నూతనంగా మండలం ఏర్పడి నాలుగేండ్లవుతున్న నేటికీ అభివద్ధిలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. దీనికి నిదర్శనం నేటికీ మండల కేంద్రంలో ఒక్క ప్రభుత్వ పక్క భవనాలు నిర్మించకపోవడమన్నారు. మండలంలోని వివిధ గ్రామాలను కలుపుకుని బస్సు సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, వికలాంగులకు పింఛన్లను తక్షణమే ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర బందం గ్రామానికి చేరుకోవడంతో పెద్దఎత్తున గ్రామస్తులు స్వాగతం పలికి పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా సహకరించాలని కోరుతూ పాదయాత్ర బందానికి గ్రామస్తులు వినతి పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో పాదయాత్ర బందం సభ్యులు కల్లూరి మల్లేశం, మాటూరి బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బట్టుపల్లి అనురాధ, కొండమడుగు నర్సింహ్మ, రమేష్ నాయక్, సీపీ(ఐ)ఎం జిల్లా నాయకులు. మామిడి వెంకట్ రెడ్డి,తుర్కపల్లి సురేందర్, బొడ్డుపల్లి వెంకటేష్, వెంకటస్వామి, మండల కార్యదర్శి బోలగాని జయరాములు, మండల నాయకులు కొల్లూరి ఆంజనేయులు, పోతుగంటి బిక్షపతి, కొమ్మగాని దశరథ, కొల్లూరి సుధాకర్, గ్రామ శాఖ కార్యదర్శి సామ రంగరెడ్డి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
చిన్న నీటి ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
వలిగొండ : జిల్లాలో బస్వాపురం ప్రాజెక్ట్‌తో పాటు చిన్న నీటి పారుదల వనరులైన బునాదిగాని, పిల్లాయిపల్లి ,బొల్లేపల్లి కాల్వలకు నిధులు కేటాయించి పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్ డిమాండ్ చేశారు. ఆదివారం జన చైతన్య పాదయాత్ర సుంకిశాల చేరుకుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన నాయకులందరికీ పుష్పాంజలి ఘటించారు .అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జహంగీర్ మాట్లాడుతూ గ్రామంలో వలిగొండ నుండి కాటేపల్లి వరకు బీటీ రోడ్డు అధ్వానంగా ఉందన్నారు. కనీసం గుంతలు పడ్డ చోట మరమ్మతులు చేయడం లేదన్నారు. పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ,రేషన్ కార్డులు, అర్హులైన వారు ఎందరో ఉన్నా ప్రభుత్వం ఇప్పటికి మంజూరు చేయకపోవడంతో వద్ధులు వికలాంగులు మహిళలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బందం నాయకులు కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బొడ్డుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బానోతు రమేష్ ,ఫైళ్ల ఆశయ్య, వేముల మహేందర్ ,మద్దెల రాజయ్య ,స్వామి ,వెంకటేశం, గోపాల్ ,తదితరులు పాల్గొన్నారు.