Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరి : స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి బీసీసీఐ మాజీ కార్యదర్శి తంగపల్లి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎండి మజర్, నాయకులు యాదగిరి కైరం కొండ వెంకటేష్ పాల్గొన్నారు. బిసి సంక్షేమ సంఘం జిల్లా కమిటీ అధ్యక్షులు కొత్త నరసింహ స్వామి నాయకులు వంగరి లక్ష్మీనారాయణ, సాబన్ కార్ వెంకటేష్, మోహన్ బీసీ నాయకులు, బాజేపీ నాయకులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్ల నరసింగరావు, పుల్ల శివ శంకర్, డి ఎల్ ఎన్ గౌడ్, రత్నా పురం బలరాం, నల్ల మాస్ వెంకటేష్ యాదవ్ వెంకటేష్ పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, దళిత ఐక్యవేదిక అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బండారు రవి వర్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్ కుమార్, పడిగెల రేణుక దొనకొండ రాములు,కొడారి వెంకటెష్, డాక్టర్ ప్రమీల, బుగ్గ జయ, సుదర్శన్ తోట సత్యనారాయణ, సతీశ్, నాగమల్లు నర్సింగరావు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : మున్సిపల్ కేంద్రంలో సోమవారం బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా పట్టణకేంద్రంలో మున్సిపల్ చైర్మెన్ శంకర్, సిల్క్‌నగర్ వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు తాటికాయల నరేందర్ , ఎస్సీకాలనీలో, రహదారి బంగ్లా వద్ద టీఎస్‌ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో , దీనశరణ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాబుజగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్ ,బాలస్వామి, సాయిబాబా , నరేష్, నాగరాజు, రమేష్ ,స్వామి, మాధవ్, మదు, సురేందర్ ,తదితరులు పాల్గొన్నారు
రాజాపేట : బాబు జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా మండలంలోని బొందుగుల గ్రామంలో టీఎస్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గొల్లురి ప్రభాకర్ జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొమ్ము ప్రకాష్ , జిల్లా గౌరవ అధ్యక్షులు ముక్క రవి ప్రకాష్ , తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : బాబు జగ్జీవాన్ రామ్ జయంతి సందర్భంగా మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య, ఎంపీటీసీ పెండల భారతమ్మ, రైతు సమన్వయ అధ్యక్షుడు వడాకాల రాంరెడ్డి, గూడెపు పాండు, బైరెడ్డి రాంరెడ్డి ,మందుల ఐలయ్య, డాక్టర్ వామనా చారి, అడ్వాకేట్ ఏపీ రాము, పంచాయతీ సెక్రెటరీ కష్ణ,తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ : బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని మండల పరిషత్ కార్యాలయంలో, శాఖా గ్రంథాలయంలో మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, బీసీ సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా బాబు జగ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ , ఎంపీడీవో ఈశ్వర్, సర్పంచ్ లలిత, ఎంపీటీసీ-1 పాలుచం రమేష్ , శాఖా గ్రంథాలయం చైర్మెన్ పబ్బు వెంకటరమణ, మాల మహానాడు జిల్లా నాయకులు రాపోలు పవన్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దుబ్బ దానయ్య ,బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు .
మోత్కూర్: మున్సిపల్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కమిషనర్ షేక్ మహమూద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైస్కూల్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షుడు చేడె చంద్రయ్య, ఉపాధ్యక్షుడు పల్లె బిక్షం, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం నర్సింహ, వైసిపి రాష్ట్ర కార్యదర్శి బాలెంల మధు, కాంగ్రెస్ జిల్లా నాయకుడు అవిశెట్టి అవిలిమల్లు, వివిధ సంఘాల ప్రతినిధులు కూరెల్ల శ్రీరాములు, మేడి అంజయ్య, కొంగరి మల్లేష్, మెంట నగేష్ తదితరులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి వైస్‌చైర్మెన్ బత్క లింగస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, కౌన్సిలర్లు పెద్దల చక్రపాణి, గుండు మధు, సామల మల్లారెడ్డి, మోటే రజిత రాజు, కుడికాలు అఖిల బలరాం, దేవరాయ కుమార్, సిబ్బంది చిరంజీవి, వెంకటేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జూకంటి పౌల్. మండల పరిషత్ సిబ్బంది శ్రీనివాస్ సాగర్ పాల్గొన్నారు.
బొమ్మలరామరం : మండల పరిషత్ కార్యాలయం నందు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఎంపీపీ సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి.సరిత ,మడిగె నర్సింహులు పాల్గొన్నారు.
బీబీనగర్ : భారత మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌రామ్ 113వ జయంతి వేడుకలను సోమవారం మండలకేంద్రంతోపాటు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎంపీపీ ఎరుకలి సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతపింగల్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, ఎస్ఐ రాఘవేందర్, మాజీ జడ్పీటీసీ సందిగారి బస్వయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నారగోని మహేశ్‌గౌడ్, ఎంఆర్పీఎస్ నాయకులు పొట్ట నవీన్‌కుమార్, మంచాల నరహరి, సోము రమేశ్, వార్డుసభ్యులు పంజాల పెంటయ్య, బెండ ప్రవీణ్, సామల వేణు పాల్గొన్నారు.