Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్
నవతెలంగాణ-నిడమనూరు
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి పి.శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మెన్ కామర్ల జానయ్య కోరారు. సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో జిల్లా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షలా 44వేల ఎకరాల్లో ధాన్యం పంట వేశారన్నారు. ఇందులో సన్నాలు 3లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 1.44 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేశారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 364 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర రూ.1888 పొందేందుకు రైతులు ధాన్యాన్ని 17 శాతం మైచర్ ఉండేలా చూసి ధాన్యం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముని క్రిష్ణయ్య సెక్రటరీ వేణు రైతులు పాల్గొన్నారు.