Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర బృందం సభ్యులు బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ- మోటకొండూర్
కేంద్రంలో బీజేపీ పభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైందని, ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర బృంధం సభ్యులు ,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన జనచైతన్య యాత్ర పాదయాత్ర బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలకే పరిమితం అయ్యాయి తప్ప మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వాటిని నిర్వీర్యం చేసే ఈ విధంగా ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళలపై అనేక సంఘటనలు జరిగాయని అందుకు ఉదాహరణగా యాదగిరిగుట్టలో బాలికలకు హార్మోన్లు పెరిగే విధంగా మందులు ఇచ్చి అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి పంపించిన పరిస్థితిని గుర్తు చేశారు. బొమ్మలరామారం మండలంలో నీ హాజీపూర్ గ్రామంలో జరిగిన ముగ్గురు అమ్మాయిల హత్య కేసులో వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.