Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితులకు ఇచ్చిన మాట నీటి మీద రాతలేనా?
- పాదయాత్ర బృందం సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు భూ పంపిణీ చేస్తామన్న ఇచ్చిన మాటలు నీటిమూటలుగా మిగిలాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ అన్నారు. పాదయాత్రలో భాగంగా భువనగిరి మండలం వీరవెళ్లి గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో లక్షా 36వేలా 108 ఎస్సీ జనాభా ఉండగా సుమారు 30 వేల కుటుంబాలు 50శాతం భూమి లేకుండా జీవనం గడుపుతున్నారన్నారు. జిల్లాలోని భూ పంపిణీ కేవలం నాలుగు మండలాల్లో నాలుగు గ్రామాల్లో 81 మందికి మాత్రమే 168 ఎకరాల 18 గుంటల భూమిని పంపిణీ చేశారని, కేసీిఆర్ భూ పంపిణీ భూటకమేనా అని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించారు. హెచ్ఎండిఏ పరిధిలో జిల్లాలోని మండలాలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఒక ఎకరం భూమి కొనుగోలుకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అర్హులైన అందరికీ పంపిణీ చేసి వారు వ్యాపారాలు చేసుకునే చూడాలని కోరారు. సీఎం కేసీఆర్ పెట్టుబడిదారులపై ఉన్న ప్రేమ పేద వర్గాలు దళితుల భూ పంపిణీలో లేదని విమర్శించారు. భువనగిరి మండలంలోని నందనం, ముత్తిరెడ్డిగూడెం, అనాజిపురం, వీరవెల్లి గ్రామాలతో పాటు అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వారికి నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకుంటూ జీవిస్తున్న రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం పంపిణీ చేసిన ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక, పల్లె ప్రకతి వనాలు, రైతు వేదికల నిర్మాణాల పేరిట గుంజుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ భూమిని తీసుకుని ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు 2019-20 సంవత్సరాలలో ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని, 2018-19 రుణాలు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ప్రస్తుత 2020- 21 సంవత్సరం సంబంధించిన యూనిట్లు 343 ఉంటే 4533 మంది దరఖాస్తు చేసుకున్నారని వీరు ఏ విధంగా లాభపడ్డారని ప్రశ్నించారు. ఎస్సీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయకుండా ఊరుకోండి ఇంటికి ఇక అన్న చందంగా కేసీఆర్ పథకాలను ప్రవేశ పెట్టారని విమర్శించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో దళితవాడలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రయినేజీల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు ,మంచినీటి సౌకర్యం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.