Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : ఆలేరు మున్సిపల్ కో -ఆప్షన్ మెంబర్ బింగి లత రవిని సోమవారం జరిగిన రాష్ట్ర మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల సమావేశంలో రాష్ట్ర కమిటీ కో ఆప్షన్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత , రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మెన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, మాజీ సర్పంచ్ చింతకింది మురళీ, నాయకులు శ్రీను, మొరిగాడి వెంకటేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.