Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ మల్లు రవి
నవతెలంగాణ-పెద్దవూర
అధికారాన్ని అడ్డం పెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం రూ.లక్షల కోట్లు దోపిడీ చేస్తుందని మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉమ్మడి ఏపీలో సీఎం పదవిని ఇస్తామన్నా వద్దని చెప్పిన వ్యక్తి జానారెడ్డి అని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏండ్లు మంత్రిగా పనిచేసిన మచ్చలేని రాజకీయ నేత జానారెడ్డి అని కొనియాడారు. జానారెడ్డి ప్రచారం చేస్తున్న క్రమంలో ఎవర్నీ పరుష పదంతో తిట్టలేదని, ఈ విషయాన్ని బాల్క సుమన్ గ్రహించాలన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు భావోద్వేగాలతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ అని, నియోజక వర్గంలో జానారెడ్డి గెలుపు చరిత్రాత్మక అవసరమన్నారు. జానారెడ్డి 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, మల్రెడ్డి రాంరెడ్డి, కార్పొరేటర్ జాహ్నవిశివారెడ్డి, జిల్లా నాయకులు పబ్బు యాదగిరి, ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మి, ముత్యాల్‌రెడ్డి, ఊరే వెంకన్న, నడ్డి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.