Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ప్రయివేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పట్టణంలోని మున్సిపల్ కార్యాయం ఎదుట ప్రైవేట్ టీచర్స్ నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారంతో ఆరోరోజుకు చేరుకున్నాయి.దీక్షలకు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజియాదవ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,టీడీపీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి ప్రభాకర్ దీక్షకు మద్దతు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు.ఏడాదికాలంగా జీతభత్యాలు లేకపోవడం వల్ల వీరి కుటుంబాలు అర్ధాకలితో అలమ టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఏడాదికాలంగా విద్యకు విద్యార్ధులు దూరం కావడం వల్ల వారికి చాలా నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు, కాంగ్రెస్ నాయకులు వంగవీటి రామారావు, పందిరినాగిరెడ్డి, సైదేశ్వర్రావు, కోటిరెడ్డి, వెంకట్రెడ్డి,సిరికొండ శ్రీనివాస్, చిలకరమేశ్, శ్రీధర్, రవినాయక్, రాంబాబు, నాగమణి పాల్గన్నారు.