Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేయాలని,రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించక పోవడం వంటివి మోడీ ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని వామపక్షాల నాయకులు ప్రజలను కోరారు.సోమవారం జిల్లాకేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సీడబ్య్లూసీ గోదాం ముందు ధర్నా నిర్వహి ంచారు.ఈ సందర్భంగా సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్కుమార్, సీపీఐ జిల్లా నాయకులు దంతాల రాంబాబు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కోటగోపి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం జిల్లా నాయకులు కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. పేద, సామాన్య ప్రజలకు సబ్సిడీపై ఇస్తున్న బియ్యం, గోధుమలు తదితర సరుకులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే విధానం క్రమక్రమంగా రద్దు చేసేందుకు మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు.ఈ చట్టాల వల్ల ప్రజలకు ప్రయోజనమేమీ లేదన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు బుద్ధ సత్యనారాయణ, బీసీపీ జిల్లా కార్యదర్శి చామకూర నర్సయ్య, సీపీఐఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య,ఏఐకెఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డుశంకర్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి కునుకుంట్ల సైదులు,ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, దేసోజు మధు, ఎస్కె సయ్యద్ పాల్గొన్నారు.