Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేళ్లచెర్వు
ప్రమాదవశాత్తు సున్నపురాయిక్వారీలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని రామాపురంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన ఉండేటి కొండలు కుమారుడు వెంకటేశ్(15) జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.సోమవారం ఉదయం వెంకటేశ్, అతని స్నేహితులు నలుగురితో కలిసి బీమా సిమెంట్స్ సున్నపురాయి క్వారీలోకి బహిర్భూమికి వెళ్లారు.సుమారు 30 అడుగుల లోతు నీళ్లున్న సున్నపురాయి క్వారీలోకి వెంకటేశ్ దిగి శుభ్రం చేసు కుంటుడగా ప్రమాదవశాత్తు కాలు జారి క్వారీలో పడిపోయి మునిగిపోతుండగా స్నేహితులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు క్వారీ వద్దకు చేరు కున్నారు.స్థానికులు నీళ్లలోకి దిగి మూడు గంటల పాటు గాలించి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. సమా చారం తెలుసుకున్న ఎస్సై సీిహెచ్.నరేశ్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.