Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు, ప్రజాప్రతినిధులు సహా అన్నివాహనాలనూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు
- ఉపఎన్నికల నేపధ్యంలో పటిష్టమైన నిఘా
నవతెలంగాణ-మిర్యాలగూడ
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అన్ని వాహనాలనూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు జగదీష్‌రెడ్డి వాహనాన్ని, కాంగ్రెస్ శాసనసభ్యురాలు సీతక్క వాహనాన్ని పులిమామిడి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. అదే విధంగా త్రిపురారం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే భాస్కర్ రావు వాహనాన్ని తనిఖీ చేశారు.
కట్టుదిట్టమైన భద్రత : డీఐజీ రంగనాధ్
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకున్నామని డీఐజీ రంగనాధ్ తెలిపారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వెళ్లే అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం, రిటర్నింగ్ అధికారి సూచనల మేరకు అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. మాస్కులు లేకుండా ప్రచారంలో పాల్గొన్నా, అనుమతులు తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.