Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ప్రయివేటు పాఠశాలలు వెంటనే తెరిచి విద్యా బోధన కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రయివేటు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మెయిన్ సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. వీరి ర్యాలీకి కాం గ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్, సీపీఐ(ఎం) నాయకులు వంటే పాక వెంకటేశ్వర్లు మద్దతు తెలిపి మాట్లాడారు. కరోనా సమయంలో పారశాలలు, కళాశాలలు బంద్ చేయడం వల్ల జీవన భృతి లేక ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయులకు నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు జె.అంజయ్య, జి.జితేందర్ రెడ్డి, జరీనా, స్వప్న, విజరు, శంకర్, అలీ, ఇమ్రాన్ పాల్గొన్నారు.