Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిస్తాం
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
నవతెలంగాణ -నల్లగొండ
ఈ నెల 12న నల్గొండలో నీలి దండు కవాత్, 30న అంబేద్కర్ జాతర రాజ్యాంగం రిజర్వేషన్ల రక్షణ,ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు .మంగళవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మహనీయుల జయంతి ఉత్సవాల మాసంగా నిర్వహించాలన్నారు. ఈ నెల 1 నుంచి 30 వరకు పూలే అంబేద్కర్ సందేశ్ యాత్రలు, జాతరను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. అన్ని మండల కేంద్రాలనుండి ఈ నెల 12న నీలి దండు కవాత్ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 30న మిర్యాలగూడ కేంద్రంలో ఫూలే, అంబేద్కర్ జాతర నిర్వహిస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం , రిజర్వేషన్ల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళితులు , గిరిజనులు , మహిళలు , మైనార్టీలు బలహీన వర్గాలపై మనువాదుల దాడులు పెరిగాయన్నారు. ఈ నెల 11న మహాత్మ జ్యోతి బా పూలే, ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతులను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అద్యక్షులు కొండేటి శ్రీను రాష్ట్ర కమిటీ సభ్యురాలు రెముడాల పరుషరాములు,జిల్లా నాయకులు బొల్లు రవీందర్, మురళి , పోలే సత్యనారాయణ అంజిబాబు, సురేష్ , రంజీత్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.