Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోపోత్సవానికి కానుకగా వచ్చిన పట్టు చీర
- భక్తుల కానుక పట్ల ఆఫీసర్ల నిర్లక్ష్యం.. !
- పైగా గోప్యత..?
- కిందిస్థాయి ఉద్యోగులే బలి..?
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి టెంపుల్ లో అమ్మవారికి భక్తుల నుండి కానుకగా వచ్చిన పట్టు చీర మాయమయిందని గుట్టంతా కోడైకూస్తోంది. గత నెల 15 నుండి 25 వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు భక్తుల నుండి కానుకల రూపంలో పట్టు చీరలు సమర్పించుకున్నారు. కాగా చివరి రోజైన దోపోత్సవం నాడు భక్తులు సమర్పించుకున్న సుమారు రూ. 50వేల విలువ గల ఒక పట్టుచీర మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కానుకలను భద్ర పరచాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాదగిరిగుట్టలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మాయమైన ఈ పట్టుచీర స్థానంలో సాధారణ చీర ఉన్నట్టు సమాచారం. ఈ విషయాలు టెంపుల్ ఆఫీసర్లు బయటకు పొక్కకుండా అత్యంత గోప్యత పాటిస్తున్నట్టు తెలిసింది. పట్టు చీర మాయమైన విషయంలో ప్రధాన పూజారి, ఈవో, ఏఈవో, సూపరింటెండెంట్లను బాధ్యులను చేయకుండా కింది స్థాయి ఉద్యోగులను బలి చేసే ప్రక్రియ ఊపందుకుందని లోకల్ లో బహిరంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.