Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, డీఐజీ ఏవి.రంగనాథ్
నవతెలంగాణ -నల్లగొండ
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోవిడ్ నిబంధనల ననుసరించి ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏవి.రంగనాథ్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు,అభ్యర్థులతో సమావేశం నిర్వహించి పలు అంశాలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున పోలింగ్ రోజున కేంద్రాల ఓటర్లకు కల్పించేందుకు టెంట్, షామియానా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద మార్కింగ్ చేయనున్నట్టు తెలిపారు. ఓటర్లు మాస్క్ ధరించి మార్కింగ్ చేసిన సర్కిల్ లలో నిలుచుని ఓటు వేయాలని అన్నారు. పోలింగ్ స్టేషన్ 200 మీటర్లు బయట ఏజెంట్లు ఇద్దరు టెంట్ వేసుకుని కూర్చోవాలని,కండువా ,పార్టీ బ్యానర్ ఏమి ఏర్పాటు చేయరాదని అన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని, ఆశా వర్కర్ లు ఉంటారని తెలిపారు. ఓర్లను ప్రలోభ పరచటానికి మద్యం,డబ్బు పంపిణీ నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.27 లక్షల నగదు,నాలుగు లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోలీస్ బందాలు,ప్లయింగ్ స్క్వ్వాడ్స్ తనిఖీలు ఉధతం చేసినట్లు, ఆకస్మికంగా తనిఖీ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర పారా మిలిటరీ సీఆర్పీఎఫ్ బందాలు కూడా రెండు,మూడు రోజుల్లో రానున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాష్ట్ర మంత్రులు, పార్టీల,స్టార్ క్యాంపెయినర్లకు భద్రతా కల్పించనున్నట్లు తెలిపారు. ఫంక్షన్ హల్ లలో సమావేశాలు నిర్వహిస్తే అభ్యర్థుల వ్యయంలో వ్యయ పరిశీలన బందాలు పరిశీలించి చర్యలు తీసుకుంటాయని అన్నారు. ఈ నెల 15 సాయంత్రం వరకు మాత్రమే ప్రచారం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నర్మద, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షలు శంకర్ నాయక్, టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, ఆకునూరి సత్యనారాయణ, టీఆర్ఎస్ జిల్లా స్పోక్స్ పర్సన్ బి.పిచ్చయ్య, సీపీఐ(ఎం) నాయకులు పి.నర్సిరెడ్డి, సీపీఐ నాయకులు ఎన్. సత్యం, బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.