Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
నవతెలంగాణ-భువనగిరిరూరల్/నల్లగొండ
కరోనా వైరస్ ఉధృతి నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. కరోనా రెండో విడత ఉధతి కొనసాగుతున్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు జారీ చేశారు. కరోనా కేసులు రోజువారీగా పెరుగుతున్న దష్ట్యా పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, మండల స్థాయి యంత్రాంగం, రెవెన్యూ అధికారులు మరింత అప్రమత్తతతో పనిచేయాలన్నారు. రోజు వారీగా కరోనా వైద్య పరీక్షలు పెంచాలని, పాజిటివ్ కేసులను, కాంటాక్ట్ కేసులను గుర్తించి హోం క్వారంటైన్ , హోం ట్రీట్మెంట్, కిట్స్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులను సిద్ధం చేసుకొని ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. టెస్టు, ట్రేస్, ట్రీట్ పద్ధతిని అవలంబించి కరోనా ఉధతిని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ రోజువారీగా పెంచాలన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ప్రతి ఒక్కరూ వినియోగించడం, శానిటైజర్ల వాడకంపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ కరోనా ఉధతి నివారణకు ఇప్పటికే పోలీస్, రెవెన్యూ యంత్రాంగాన్ని సమన్వయపరచి గ్రామస్థాయి మండల స్థాయి మైక్రో ప్రణాళికలు రూపొందించి అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వివరించారు. కరోనా వ్యాక్సినేషన్ పెంచడంతో పాటు కరోనా పరిశీలించడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు కీమ్యా నాయక్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివ రావు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ కరోనా ఉధతి నివారణకు ఇప్పటికే పోలీస్,రెవెన్యూ, ఇతర యంత్రాంగాన్ని సమన్వయ పరచి గ్రామ స్థాయి వరకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్, పరీక్షలు పెంచడానికి తగు చర్యలు తీడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్(రెవెన్యూ) వి.చంద్ర శేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృ, డీఆర్డీఓ.శేఖర్ రెడ్డి, జెడ్పీసీఈఓ వీరబ్రహ్మ చారి తదితరులు పాల్గొన్నారు.