Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదాం పరిశీలన
నవతెలంగాణ -నల్లగొండ
నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంను మంగళవారం కలెక్టర్ ప్రశాంత్జీవన్పాటిల్ పరిశీలించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు పై అధికారులతో చర్చించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్(రెవెన్యూ),జిల్లా రెవెన్యూ అధికారి జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఎన్నికల శిక్షణకు హాజరుకాకుంటే చర్యలు
నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై ఎన్నికల శిక్షణకు హాజరు కాకుంటే పీఓ, ఏపీఓలపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి ,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నానాగార్జున సాగర్ నియోజకవర్గ స్థానానికి నిర్వహిస్తున్న ఉప ఎన్నిక నిర్వహణ పై మంగళవారం స్థానిక కోమటిరెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాలలో మొదటి విడుదల పీఓ, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ శిక్షణకు కొంత మంది హాజరు కాకపోవటం గమనించి జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ కు రిపోర్ట్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నిబంధనల ననుసరించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల7న నిర్వహించే పీఓ,ఏపీఓల శిక్షణకు, 8,9 తేదీల్లో ఓపీఓలకు , 11,12 తేదీల్లో పీఓ, ఏపీఓలకు లకు నిడమనూర్ మోడల్ స్కూల్ లో నిర్వహించే రెండవ విడత శిక్షణా కార్యక్రమానికి విధులు కేటాయిొచిన పీఓ, ఏపీఓలు, ఓపీఓలు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.