Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిట్టల గూడెంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి
- ఉపాధి హామీ పనులు కల్పించాలి
- సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర రథసారధి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -మోటకొండూర్
మండల పరిధిలోని పిట్టలగూడెం గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర రథసారథి, పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సాగు తాగునీరు, విద్య, వైద్యం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య పాదయాత్ర మంగళవారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, పిట్టలగూడెంలో కొనసాగింది. ఈ సందర్భంగా పిట్టలగూడెం గ్రామస్థులు, మహిళలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతూ బోనాలు బతుకమ్మతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్వాతంత్రం వచ్చి 70 ఏండ్ల్లు గడుస్తున్నా నీటికి సమాజానికి దూరంగా నెట్టి వేయబడి గుడిసెల్లో జీవిస్తున్నారన్నారు. అసలు పిట్టల గూడెం ఉండదనే విషయం ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న చాడా గ్రామానికి ఎన్నో సార్లు వచ్చిన ఎమ్మెల్యే పిట్టల గూడంకు ఎందుకు రావడం లేదని వారి సమస్యలు ఎందుకు పరిష్కరించండం లేదో చెప్పాలని ప్రశ్నించారు. గ్రామంలో కనీస సదుపాయాలు లేకపోవడంతో మహిళలు బహిర్భూమికి వెళ్లాలన్నా,స్నానాలు చేయాలన్న ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రతి కుటుంబానికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గ్రామంలోనే రేషన్ షాపు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు., గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, స్వచ్ఛభారత్ ద్వారా మరుగుదొడ్లు బాత్రూం చితంగా నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. జిల్లాలో గిరిజనుల పరిస్థితి చాలా అధ్వానంగాఉన్నందన్నారు. వారు సాగుచేసుకుంటున్న భూమికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని. ఉన్న వాటిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో వారికి రైతుబంధు కూడా రావడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు పిట్టలగూడెం గ్రామాన్ని సందర్శించి రచ్చబండ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించని ఎడల కలెక్టరేట్ కార్యాలయం వద్ద వంటావార్పు చేసి ముట్టడిని ఉద్ధతం చేస్తామని హెచ్చరించారు.
ఉపాధి హామీ పనులు కల్పించాలి
పిట్టల గూడెం గ్రామంలో 450 జనాభా 85 కుటుంబాలు నివసిస్తున్నారని వీరికి ఉపాధి హామీ చట్టం ద్వారా పనులు ఎందుకు కల్పించడం చెప్పాలని డిమాండ్ చేశారు. పనులు కల్పిస్తే వారి జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. గ్రామంలో ఉన్న పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దాతల సహాయంతో చదువుకు దూరంగా ఉన్న పిల్లలను విద్య వైపు ప్రయత్నించే విధంగా వారి చదువులకు కావాల్సిన ఖర్చు సీపీఐ(ఎం) భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బందం సభ్యులు కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేష్, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ధీరావత్ రమేష్ నాయక్, సిపిఎం మండల కార్యదర్శి బోలగాని జయరాములు, మండల నాయకులు కొల్లూరి ఆంజనేయులు, పోతుగంటి బిక్షపతి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు, భోగ రమేష్, కొల్లూరి సుధాకర్, ఆడెపు సోములు, కాల్య విజరు, గోపాల్, బుజ్జమ్మ, తుమ్మల మల్లేష్, అనసూయ, నాయక్, తదితరులు పాల్గొన్నారు.