Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేతపల్లి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉప్పలపాడు బంగారు మైసమ్మ స్టేజీ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన తౌడు లింగారెడ్డి తన హీరో హోండా మోటార్ బైక్ పై నల్లగొండ జిల్లా నకిరేకల్ కు బంధువుల ఇంటికి వెళుతుండగా తన వెనకాల ఉన్న లగేజీ సంచి జారీ బైక్ వెనుక చక్రంలో పడి పోయింది. దీంతో బైకు డివైడర్ను ఢకొీట్టడంతో లింగారెడ్డి (40) అక్కడికక్కడే మతి చెందాడు. మత దేహాన్ని 108 వాహనంలో పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కేతపల్లి ఎస్ఐ బి రామకష్ణ తెలిపారు.