Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
కరోనా సాకుతో విద్యా సంస్థలను మూసేయడం సరికాదని అఖిలపక్ష నాయకులు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్, ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రయివేటు ఉపాధ్యాయులు చేపట్టిన ధర్నాకు వారు మంగళవారం మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రయివేటు ఉపాధ్యాయులకు కరోనా భృతి ఇవ్వాలన్నారు. వారికి వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఆర్డీవో కిషోర్‌కుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ముత్యాలు, వంగవీటి రామారావు, మేకల శ్రీనివాసరావు, చెటపూరి కొండలు, సిరికొండ శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.