Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్వపల్లి : రైతులు దళారులకు ధాన్యం అమ్మి మోస పోవొద్దని ఎంపీపీ మన్నె రేణుక, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని కోడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి నాయకులు గుండగాని సోమేష్, గ్రామ సర్పంచ్ బాబు, ఎంపీటీసీ గంట సుమలత, మన్నె లక్ష్మినర్సయ్యయాదవ్, వెంకన్న, తహసీల్దార్ ఏ.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎం ఇద్దయ్య, ఏఈవో సత్యం పాల్గొన్నారు.
తిరుమలగిరి : మండలంలోని గుండెపురి, బండ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహాలత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని తేమ లేకుండా, తాలు, మట్టిపెళ్లలు లేకుండా తీసుకొచ్చి మద్దతు ధర పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దూపటి అంజలి, ఏపీఎం నర్సయ్య, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.