Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ డిమాండ్
నవతెలంగాణ - సూర్యాపేట
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ వద్ధాప్య, వితంతు పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నేటి వరకు ఒక్క రేషన్ కార్డు, పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. అనేక మంది పేద మహిళలు పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని కోరారు. దేశం, రాష్ట్రంలో కరోనా రెండవ దశ ప్రారంభ మైనందున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రజలు కరోనా బారిన పడకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జంపాల స్వరాజ్యం, మేకనబోయిన సైదమ్మ, జిల్లా నాయకురాలు ఎల్గురి జ్యోతి పాల్గొన్నారు.