Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
కరోనా వైరస్ ఉధృతిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. కరోనా సెకండ్ వే పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా పని చేయాలని కోరారు. రోజు వారిగా కరోనా పరీక్షలు పెంచాలని, పాజిటివ్, కాంటాక్ట్ కేసులను గుర్తించి వారిని హోంక్వారంటైన్ చేసి ట్రీట్మెంట్ కిట్స్ అందజేయాలని ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రేసింగ్, ట్రీట్మెంట్ పద్ధతిని అవలంబించి కరోనా ఉధతిని అరికట్టాలన్నారు. 45 ఏండ్లు పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ టి.వినరుకృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా ఉధృతి నివారణ కోసం ఇప్పటికే పోలీస్, రెవెన్యూ, ఇతర యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయి వరకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పద్మజారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కోటాచలం, సీఈవో విజయలక్ష్మి, ఏరియాస్పత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రెడ్డి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.