Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు
- పట్టించుకోని స్థానిక ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-బొమ్మలరామారం
బొమ్మలరామారం మండలం లోని మర్యాల గ్రామంలో బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు 56 ఎకరాలలో ప్రభుత్వ భూమి అప్పగించి ఐదేండ్లు గడిచినా ఇప్పటివరకు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జవానులు. దేశ రక్షణ కోసం పనిచేస్తూ బీఎస్ఎఫ్ బెటాలియన్ గ్రామాలలో దాదాపు రెండు కోట్ల మౌలిక సదుపాయాలతో ఉన్నాయని ఉన్నతాధికారులు తెలియజేశారు. కానీ ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మర్యాల గ్రామ పరిసరాలలో ఉన్న బెటాలియన్‌కు మాత్రం త్రాగడానికి నీరు లేకపోవడం చాలా బాధాకరం. ఐదు రోజుల కొకసారి వాహనంలో రెండు డ్రమ్ములతో రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి తీసుకురావాల్సిన పరిస్థితిలో ఉంది. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో మర్యాల గ్రామ పరిసరాలలో ఈ బెటాలియన్ స్థావరాన్ని ఏర్పాటుకు చేసింది కేంద్ర ప్రభుత్వం.దేశంలో ఉగ్రవాదులు దాడులు సంఘవిద్రోహ శక్తులను తిప్పికొట్టడానికి దక్షిణ భారతదేశంలో బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరం సమీపంలో బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.అయితే ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని శివారు ప్రాంతం అనుకూలంగా ఉన్న మర్యాల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 343 లో 56 ఎకరాలను బీఎస్ఎఫ్ బెటాలియన్ కోసం కేటాయించారు. కానీ బెటాలియన్ మాత్రం ఇబ్బందులు మాత్రం ఎదుర్కోక తప్పడం లేదు.