Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
మండలంలోని గాజులగూడెం గ్రామానికి చెందిన గాజుల సోమయ్య ధనమ్మ దంపతుల కుమారుడు గాజుల రాజుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో డాక్టరేట్ ప్రదానం చేసింది.వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రాజు పదో తరగతి వరకు మండల కేంద్రంలోని శ్రీ విద్యాభారతి ఉన్నత పాఠశాలలో, ఇంటర్ ఖమ్మంలోని శ్రీ చైతన్య కాలేజీలో, డిగ్రీ ఎస్ఆర్ అండ్బీజీఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఖమ్మం నందు, ఎమ్మెస్సీ ఉస్మా నియా విశ్వ విద్యాలయంలో, పీహెచ్డీ ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్టుమెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో పూర్తి చేశారు.'విజాతీయ ఆరోమాటిక్ సమ్మేళనాలను ఒకే మూసవిధానంలో తయారుచేసి వాటిపైన కాంతి కిరణాల ప్రభావం-జీవులపైన వాటి యొక్క ప్రభావం' అనే అంశంపై ప్రొఫెసర్ బట్టు సత్య నారాయణ పర్యవేక్షణలో పరిశోధన గ్రంథాన్ని ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షా విభాగానికి సమర్పించారు.దీంతో పరీక్షల విభాగం అధికారులు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అంతర్జాతీయస్థాయిలో 8 పరిశోధన పత్రాలు ప్రచురింపబడ్డాయి.ఈ మేరకు రాజు మాట్లాడుతూ డాక్టరేట్ రావడం పట్ల చాలా ఆనందంగా ఉందని తెలిపారు.తనకు సహకరించిన ప్రొఫెసర్లకు,మిత్రులకు కతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రాజుకు ఉపాధ్యాయులు,గ్రామస్తులు,స్నేహితులు పలువురుఅభినందనలు తెలిపారు.