Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
జాన్‌పహాడ్ రైల్వేస్టేషన్ మీదగా ప్యాసింజర్ రైళ్లను నడపాలని గిరిజన శక్తి జిల్లా ప్రధాన కార్యదర్శి కేళావత్ మధునాయక్ కోరారు.బుధవారం దర్గా గ్రామ పంచాయతీలో గిరిజన శక్తి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాన్‌పహాడ్ నుండి జగ్గయ్యపేటవరకూ రైల్వేలైన్ పనులు అయిపోయి ఏండ్లు గడుస్తున్నా..ఇప్పటివరకు ప్యాసింజర్ రైళ్లను నడిపించకపోవడం బాధాకరమన్నారు.జాన్‌పహాడ్ దర్గా నుండి విజయవాడ వరకు ప్యాసింజర్ రైళ్లను నడిపితే చిరు వ్యాపారులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. అదేవిధంగా విజయవాడ వెళ్లాలంటే గంట సమయంలో చేరుకోవచ్చన్నారు.ప్రస్తుత కాలంలో నిరుద్యోగులు కోచింగ్‌కు వెళ్లాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందని, కానీ ఇక్కడి నుండి రైళ్ళు నడిస్తే చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇక్కడి నుండి విజయవాడ కోచింగ్‌కి పోయి రావొచ్చన్నారు.గతంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కూడా వినతిపత్రం అందజేశామన్నారు.చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పెద్దలు, యువకులు ప్యాసింజర్ రైళ్లను నడపాలని కోరుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మోతీలాల్‌నాయక్, చంద్రునాయక్, శ్రీకాంత్‌నాయక్, పాండునాయక్, రవినాయక్, బాలాజీనాయక్ పాల్గొన్నారు.