Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్వో కోటాచలం
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రతిఒక్కరూ సమతుల ఆహారం తీసుకుని మానసికఒత్తిడి లేని మంచి జీవనశైలి విధానాన్ని అనుసరించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం వెల్లడించారు.ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరిం చుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అవగాహనా సదస్సు నిర్వహించారు.ప్రతిఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భవించిన సందర్భంగా ఈ సంస్థ ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆరోగ్య జీవన స్థితిగతులపై నూతన నినాదం, మార్గదర్శకాలు,హెచ్చరికలు జారీ చేస్తుం దన్నారు.ఈ ఏడాది ప్రతిఒక్కరూ ప్రతిచోటా ప్రపంచమంతా నిస్పాక్షికమైన, స్వచ్చమైన ఆరోగ్య జీవన విధానం పాటిస్తే సమన్యాయంతో కూడిన ఆరోగ్య సమాజాన్ని నిర్మించొచ్చన్నారు.మానసిక ఒత్తిడి, రుగ్మతలకు కారణమయ్యే ఆర్ధిక ఇబ్బందులను తొలగించు కోవాలన్నారు.ప్రతిపౌరుడు ప్రణాళికాబద్ధంగా జీవించి నట్టయితే జీవన శైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ మొదలగు జబ్బులకు దూరంగా ఉండ వచ్చన్నారు.0-6 ఏండ్లలోపు పిల్లలలో 1000 మంది బాలురకు 916 మండి బాలికలు మాత్రమే ఉన్నందున లింగవివక్ష ఆందోళన కలిగిస్తుందని, దీనికి తగు చర్యలు చేపట్టకపోతే ముందుతరాలకు ఆడ పిల్లలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనికి ప్రజలు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు,డాక్టర్లు,పలు స్వచ్ఛంద సంస్థలు కషి చేయాలన్నారు. ప్రజలు సురక్షితమైన మంచినీటిని తాగినట్టయితే నీటి ద్వారా వచ్చే వ్యాధులను అరికట్ట వచ్చన్నారు.కుల,మత, ప్రాంతీయ అసమానతలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, వాటిని రూపు మాపా లన్నారు.పిల్లలకు పోషకాహారం అందించి వ్యాధినిరోధక టీకాలు వేయించాలన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఎన్నో మానసిక, ఆర్ధిక ఆరోగ్య ఇబ్బందులకు గురి చేస్తున్న కోవిడ్-19 వ్యాధిపై జిల్లా ప్రజలందరూ అప్రమత్తమై ప్రభుత్వ ఆదేశాలు, సూచనలు పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.కె.హర్షవర్థన్, ప్రోగ్రాం అధికారులు డా.సాహితి, డా.చంద్రశేఖర్, డా.శ్రీని వాసరాజు, డా.పాపిరెడ్డి, డా.వినయానంద్, మీడియా అధికారి అంజయ్యగౌడ్, డీఐఓ వెంకటరమణ పాల్గొన్నారు.