Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఇటీవల జరిగిన సూర్యాపేట బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంఘం ఎన్నికలలో ప్రముఖ న్యాయవాది గుంటూరు మధు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను న్యాయవాద వత్తిలో 25 ఏండ్లుగా పనిచేస్తూ పేద బడుగు,బలహీన వర్గాల వారికి ఉచితంగా న్యాయ సలహాలు ఇస్తున్నట్టు చెప్పారు.ఇక ముందు కూడా నిరుపేద కక్షిదారులకు మరింతగా ఉచిత న్యాయసహాయాలు వ్యాప్తి చేస్తానని స్పష్టం చేశారు.తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన సూర్యాపేట న్యాయవాదులకు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మరో న్యాయవాది,మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్లహసేన్ గుంటూరు మధుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర గ్రంథాన్ని బహూకరించారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం రాష్ట్ర కార్యదర్శి పంగరెక్క సంజరు,రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి దేవయ్య, న్యాయవాదులు బొల్లెద్దు వెంకటరత్నం, రేగట్టి లింగయ్యగౌడ్, కోక రంజిత్‌కుమార్, కంచరదాస్ ఆనందరావు, గాజులనర్సయ్య, బోయల అఖిల్, విర్జాల వేణుబలరాం, చింతమల్ల జగదీష్, కోదాటి అశోక్, పిండిగ విజరు పాల్గొన్నారు.