Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దవూర:ఉప ఎన్నికల్లో ముందుగా అభ్యర్థిని ప్రటించకుండా బందిపోటు దొంగల్లాగా నెలరోజుల ముందే డబ్బు సంచులతో ఎమ్మెల్యేలను నియోజక వర్గంలో పంపించి ఉసిగొల్పారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి రూ.200 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి బెదిరించి పార్టీలో చేర్పించుకుంటున్నారని తెలిపారు. నియోజక వర్గంలో జానారెడ్డి చేసిన అభివృద్ధి చూడలేని స్థితిలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మాజీ ఎంపీ శంకర్‌నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ కత్తి మహాలక్ష్మిముత్యాల్రెడ్డి, జిల్లా నాయకులు పబ్బు యాదగిరి, నడ్డి ఆంజనేయులు, కోట అంజి తదితరులు పాల్గొన్నారు.