Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్తోనే అభివృద్ధి
- విలేకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
నవతెలంగాణ-మిర్యాలగూడ
వయస్సు మీరిన జానారెడ్డికి ఓటు వేస్తే వృథా అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆరోపించారు. బుధవారం స్థానిక షాదీఖానాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగుసార్లు మంత్రి పదవి, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏడుసార్లు గెలిచి అనేక మంత్రి పదవులు అనుభవించిన జానారెడ్డి నియోజకవర్గ అభివద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. నేటికీ ఆ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో కనీస వసతుల్లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రజాసేవకు ఆయన శక్తి ఇప్పుడు సరిపోదని చెప్పుకొచ్చారు. విద్యావంతుడైన యువకుడు నోముల భగత్‌ను గెలిపిస్తే కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్లో నిధులు కేటాయించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు.అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ మాజీ చైర్మన్ మసి ఉల్లాఖాన్, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ వలీ, మౌలానా జావీద్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఫరీదుద్దీన్, నాయకులు అరీఫ్, మునీర్ అబ్బాస్, ఫహిముద్దీన్, షాదీఖానా చైర్మన్ హఫీజుద్దీన్ పాషా, జావీద్, కౌన్సిలర్లు సలీం, ఇలియాజ్, టీఆర్ఎస్ హబీబ్, మౌజంఅలీ, మాజిద్, మౌలాలి, గయాజ్, నాయకులు, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.