Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి వారం రెండు గంటలు ఆనాథ ఆశ్రమంలో గడపాలని ఆదేశం
నవతెలంగాణ - నల్లగొండ
కోర్టు ధిక్కార కేసులో నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు హైకోర్టు బుధవారం శిక్ష విధించింది. ప్రతి వారం రెండు గంటలపాటు అనాథాశ్రమంలో గడపాలని ఆదేశించింది. ఇలా ఆరు నెలలపాటు ఖచ్చితంగా వెళ్లాలని కోర్టు సూచించింది . ఇదే కేసులో ఉన్న మరో అధికారి సంధ్యకు కూడా కోర్టు శిక్షను ఖరారు చేసింది. వీరు చేసిన తప్పుకు శిక్షగా రాబోయే ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న అనాథాశ్రమంలో భోజనం పెట్టాలని ఆదేశించింది. ఒకే కేసులో ఇద్దరు అధికారులకు కోర్టు ధిక్కారణ కింద రూ.2000 జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని కలెక్టర్ డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవరిస్తూ డివిజన్ బెంచ్ సామాజిక సేవ చేయాలని ఆదేశించి విచారణను ముగించింది.