Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆత్మకూర్ఎం
జన చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి ఆత్మకూర్ మండల పరిధిలోని కూరెల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రదర్శించిన వీర తెలంగాణ నాటకం గ్రామస్థులను ఆకట్టుకుంది. దొరల పెత్తనం, వెట్టిచాకిరి, నిజం పరిపాలన, తెలంగాణ సాయుధ పోరాట వీరుల పోరాట స్ఫూర్తిని నాటికలో వివరించారు.అనంతరం గ్రామాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు పాదయాత్ర బందానికి దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర రథసారధి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, బందం కల్లూరి మల్లేశం, కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, రమేష్ నాయక్, సీపీఐ జిల్లా కార్యవర్గగ సభ్యులు ఉప్పల ముత్యాలు, మండల నాయకులు మారుపాక వెంకటేశం, జిల్లా నాయకులు రచ్చ గోవర్ధన్, మండల కార్యదర్శి చెరుకు మల్లేష్,సత్తయ్య, యాదగిరి, కూరెళ్ళ గ్రామ శాఖ కార్యదర్శి భాష బోయిన బుగ్గయ్య, వేముల బిక్షం, భాష బోయిన రాములు, మరిపెళ్లి మల్లయ్య, జిల్లా నాయకులు సిర్పంగి స్వామి, అనగంటి వెంకటేష్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు, తదితరులు పాల్గొన్నారు.