Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : బార్అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అడ్వకేట్ సీస శ్రీనివాస్‌ను బుధవారం పట్టణంలో వెంకట్రామయ్య నగర్‌లోని ఘనగాని ఆనంద్ కార్యాల యంలో సన్మానించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ మాజీ చైర్మెన్ చంద్రశేఖర్ మాట్లా డుతూ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి లాయర్లు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మొరిగాడి మహేష్ ,లక్ష్మీ విలాస్ అండ్ డెవలప్ ఘనగాని ఆనంద్, శివయ్య, నర్పింహులు, ఎల్లందరెడ్డి , చంద్రమౌళి, సత్తెయ్య ,చందు, విక్రమ్ పాల్గొన్నారు.