Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
- సీపీఐ(ఎం) జన చైతన్య పాదయాత్ర రథసారథి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -ఆత్మకూర్ఎం
దేశంలోని వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమ చేనేతఅని, రైతుబంధు తరహాలోనే చేనేత కార్మికులకు కూడా చేనేత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని సీపీఐ(ఎం) జన చైతన్య పాదయాత్ర రథసారథి ,జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం సీపీఐ(ఎం)ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య పాదయాత్ర బుధవారం మండలంలోని కూరెల్ల గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభమైంది. కూరెళ్ళ , రాఘవాపురం గ్రామాల మధ్య గల రహదారిపై ఉన్న బ్రిడ్జిని పాద యాత్ర బందం సందర్శించి పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని తొలగించి ఎత్తయిన బ్రిడ్జిని నిర్మించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాదయాత్ర బదానికి రాఘవపురం ప్రజలు, చేనేత కార్మికులు నూలు దండలను వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సమస్యలను పాదయాత్ర బందానికి తెలియజేశారు. కార్మికుల ఇండ్లలోని నేత మగ్గాలను పాదయాత్ర బందం పరిశీలించింది. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ చేనేతకు యాదాద్రి జిల్లా ప్రసిద్ధి గాంచిందన్నారు. చేనేత కార్మికులకు సరైన ఉపాధి లేక ,కూలి గిట్టుబాటుకాక రోజురోజుకు పరిస్థితులు చాలా దయనీయంగా మారాయన్నారు. కార్మికులకు ఉపాధి ఉందని నేతకు వినియోగించే రసాయనాల రేట్లు రోజురోజుకు పెరగడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. . భార్యా భర్త లు ఇద్దరూ కలిసి నెల రోజుల పాటు శ్రమించి 7 చీరలు నేస్తే నెలకు కేవలం రూ.10 వేలు రావడంవల్ల కుటుంబం గడవక రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రైతుబంధు పథకం మాదిరిగానే చేనేత బంధు పథకాన్ని ఏర్పాటు చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకంలో చేనేత చీరను జోడించి కల్యాణ లక్ష్మి అందించాలన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా ప్రతి సోమవారం ప్రభుత్వ అధికారులు చేనేత వస్త్రాలను ధరించి రావాలని , ప్రభుత్వం దష్టి సాధించి అమలు చేయాలని,చేనేత కార్మికులకు అండగా ఉండాలని కోరారు. కార్మికులకు కూడా జాబ్ కార్డులను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బందం కొండమడుగు నరసింహ, మాటలు బాలరాజు గౌడ్ ,కల్లూరి మల్లేశం, బట్టుపల్లి అనురాధ ,కోమటిరెడ్డి చంద్రారెడ్డి ,ధరావత్ రమేష్ నాయక్ సిపిఎం డివిజన్ నాయకులు రచ్చ గోవర్ధన్ ,వి గోపాల్ రెడ్డి, రామ్ రెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెరుకు మల్లేష్ మండల నాయకులు భాషబోయిన రాములు, వేముల బిక్షంం, భాష బోయిన బుగ్గయ్య, రాచమల్ల సత్తయ్య ,నాయిని కష్ణా రెడ్డి , జి స్వామి యాదిరెడ్డి పాల్గొన్నారు.